న్యూయార్క్: అమెరికా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. తొలి రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి చైనా దిగుమతులపై పది శాతం సుంకాన్ని విధించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆ సుంకం వసూల్ చేసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. వైట్‌హౌజ్‌లో రిపోర్టర్లతో మాట్లాడుతూ.. మెక్సికో, కెనడా రూట్లో చైనా అక్రమంగా సింథటిక్ డ్రగ్ ఫెంటానిల్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆరోపించారు. మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై 25 శాతం పన్ను వసూల్ చేయనున్నట్లు కూడా ట్రంప్ హెచ్చరించారు. ఆ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు చెప్పారు.
క్యాపిటల్ హిల్ అటాక్ దాడి కేసుతో లింకున్న 1600 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఇద్దరు హై ప్రొఫైల్ ఖదీలను రిలీజ్ చేయడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. కొత్త ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. చర్చిలు, స్కూళ్లలో కూడా ఇమ్మిగ్రేషన్ తనిఖీలు నిర్వహించనున్నారు. జనవరి 6 ఘటనకు పాల్పడిన వారిలో ఖ్వానన్ షామన్ జాకెబ్ ఛాంస్లే, డార్క్ వెబ్ ఆపరేటర్ రాస్ ఉల్బ్రిచ్ ఉన్నారు. రాబోయే అయిదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రైవేటు రంగం సుమారు 500 బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. ఓపెన్ ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్ లాంటి సంస్థలు ఆ పెట్టుబడి పెట్టనున్నాయి.