రాయపోల్, ఫిబ్రవరి 13 : సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో రాయపోల్ మండలం రాంసాగర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రతిభ చాటింది. ఫిబ్రవరి 12న జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో మండల జట్టు తరఫున ఆడిన సీహెచ్ అపూర్వ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన అపూర్వను పాఠశాల ధానోపాధ్యాయులు రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు అనీఫ్ అభినందించారు. ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు గచ్చిబౌలిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ఆమె పాల్గొననుందని వారు తెలిపారు.