Watch: 200 మంది పోలీసుల భద్రత మధ్య.. గుర్రంపై ఊరేగిన దళిత వరుడు, ఎందుకంటే?
200 Cops As Security For Dalit Groom | సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్‌గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జైపూర్: సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య (200 Cops As Security For Dalit Groom) దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్‌గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని ఆ గ్రామంలోని ఉన్నత కులాల వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన వధువు తండ్రి పోలీసుల సహాయం కోరాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దళిత వర్గానికి చెందిన విజయ్ రేగర్‌కు లావెరా గ్రామానికి చెందిన దళిత మహిళ అరుణతో పెళ్లి నిశ్చియమైంది.
కాగా, దళిత వరుడు గుర్రంపై ఊరేగడంపై ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారు వ్యతిరేకం వ్యక్తం చేశారు. దీంతో వధువు అరుణ కుటుంబం ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో మానవ్ వికాస్ అవమ్ అధికార్ కేంద్ర సంస్థాన్ కార్యదర్శి రమేష్ చంద్ బన్సాల్ సహా స్థానిక కార్యకర్తలను అరుణ తండ్రి నారాయణ్ కలిశాడు. వారి సహాయంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశాడు. అలాగే దళిత వరుడి బారత్‌కు భద్రత కోసం పోలీస్ అధికారులను కలిశాడు.
మరోవైపు దళిత వధువు అరుణ కుటుంబం ఆందోళనపై అజ్మీర్ ఎస్పీ స్పందించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు కోసం భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దీంతో పలు పోలీస్ స్టేషన్ల నుంచి సుమారు 200 మంది పోలీసులను లావెరా గ్రామంలో మోహరించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు కోసం ముందుగా గ్రామస్తులతో చర్చించారు. ఉన్నత కులాల వారు సానుకూలంగా స్పందించారు. ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని చెప్పారు.
కాగా, జనవరి 21న సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు విజయ్ గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మేళతాళాలు, డ్యాన్సుల మధ్య బారత్‌గా దళిత వధువు అరుణ ఇంటికి చేరుకుని ఆమెను పెళ్లాడాడు. అయితే గ్రామంలోని అగ్రవర్ణాలకు ఆగ్రహం కలిగించకుండా ఉండేందుకు డీజే, పటాకులు కాల్చడం వంటి హంగామాకు వధువు కుటుంబం దూరంగా ఉన్నది. మరోవైపు భారీ పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు విజయ్ గుర్రంపై ఊరేగిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కుల వివక్షపట్ల నెటిజన్లు మండిపడ్డారు.
National Shame for India.
Wedding procession of a Dalit boy was carried out under heavy police protection in RJ’s Ajmer dist due to the fear of attack by dominant caste goons. Terrible!
The police force was more than the relatives of the couple’s family. This is the India where… pic.twitter.com/J7ipaVZutT
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) January 23, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

