Fire at AIIMS | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS)లోని ట్రామా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ట్రామా సెంటర్ బయట ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఈ మంటలు (electric transformer caught fire) చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు ఎగసిపడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | An electric transformer caught fire at AIIMS Trauma Centre in New Delhi. A total of 8 fire engines reached the spot, and the fire was extinguished. No injury reported.
(Source: Delhi Fire Service) pic.twitter.com/Olkdxb3fNr
— ANI (@ANI) July 3, 2025
Also Read..
Serum Institute | కొవిడ్ టీకాలు సురక్షితమైనవి : సీరమ్ ఇన్స్టిట్యూట్
Hospital Collapses | కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం.. ఇద్దరు మృతి