Amit Shah | అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ (Mahagatbandhan) సీఎం అభ్యర్థిగా (Bihar CM) తేజస్వీయాదవ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్డీయే కూటమి మాత్రం ఇప్పటి వరకూ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.
దీంతో ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష కూటమి పార్టీల నేతలు బీజేపీ, జేడీయూ లక్ష్యంగా విమర్శలకు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) కౌంటర్ ఇచ్చారు. బీహార్‌లో దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఏ సీటూ ఖాళీగా లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రధానిగా నరేంద్రమోదీ ఉంటారన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ కొనసాగుతారని స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Also Read..
Rajnath Singh | రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్ నీతి రాజకీయాలు చేయలేరా..? : రాజ్‌నాథ్ సింగ్
Priyanka Gandhi | దానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది : ప్రియాంకాగాంధీ
Air Pollution | ఢిల్లీలో మేఘ మథనం విఫలం.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం