Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా దీపావళి పండుగ తర్వాత గాలి నాణ్యత క్షీణించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మేఘ మథనం’ (Cloud Seeding) విఫలమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన విభాగంలో నమోదైంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. బుధవారం ఉదయం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 కంటే ఎక్కువగానే నమోదైంది. ఆనంద్ విహార్ అబ్జర్వేటరీలో ఏక్యూఐ లెవెల్స్ 312గా నమోదయ్యాయి. ఐటీవో, అక్షర్ ధామ్ వద్ద ఏక్యూఐ 307గా, ఇండిగా గేట్ వద్ద 282గా గాలి నాణ్యత సూచీ నమోదైంది.
వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 53 ఏండ్ల తర్వాత ఢిల్లీలో కాలుష్య స్థాయిలను పెంచేందుకు క్లౌడ్ సీడింగ్ నిర్వహించింది. ఐఐటీ కాన్పూర్ సహకారంతో బురారి, ఉత్తర కరోల్ బాగ్, మయూర్ విహార్, బద్లి సహా పలు ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించింది. ప్రయోగానికి ఉపయోగించిన విమానం కాన్పూర్ నుంచి బయల్దేరి 6,000 అడుగుల ఎత్తులో రసాయనాలను వెదజల్లింది. అయితే, ఈ ప్రయత్నం విఫలమైంది. ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురవకపోవడం అందరినీ నిరుత్సాహపర్చింది.
Also Read..
President Murmu | రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము.. VIDEO
Donald Trump | ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి.. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం : ట్రంప్
Mysterious lights | పాక్ ఆకాశంలో వింత వెలుగులు.. నెట్టింట చర్చ