Mysterious lights | దాయాది పాకిస్థాన్ (Pakistan) ఆకాశంలో వింత వెలుగు (Mysterious lights) దర్శనమిచ్చింది. రంగురంగుల కాంతులతో కూడిన ఈ వింత వెలుగులపై నెట్టింట నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు ఇది క్షిపణి ప్రయోగం అని చెబుతుండగా.. మరికొందరు గ్రహాంతరవాసుల వాహనం అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే, అది ప్రకృతి సృష్టి అని తేలింది.
క్వెట్టా (Quetta) నగరానికి తూర్పున ఉన్న కొహ్-ఎ-ముర్దార్ (Koh-e-Murdaar) పర్వతశ్రేణిపై సూర్యోదయానికి ముందు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు 20 నిమిషాల పాటూ ఈ కాంతి కనువిందు చేసింది. ఆ తర్వాత అవి కనుమరుగయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వింత కాంతిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే, అవి ‘లెంటిక్యులర్ క్లౌడ్స్’ (Lenticular clouds)గా శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి చాలా అరుదుగా వస్తాయని తెలిపారు.
Also Read..
Bishnoi gang | కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు.. పంజాబ్ సింగర్ ఇంటిపై కాల్పులు
Brazil: బ్రెజిల్లో డ్రగ్ ముఠాలపై దాడులు.. 64 మంది మృతి
Hurricane Melissa | కరీబియన్ ద్వీప దేశాలపై విరుచుకుపడుతున్న హరికేన్ మెలిసా.. ఏడుగురు మృతి