రియో డి జనైరో: రియో డి జనైరోలో రక్తం ఏరులై పారింది. డ్రగ్ దందా నిర్వహిస్తున్న ముఠాలపై బ్రెజిల్(Brazil) పోలీసులు విరుచుకుపడ్డారు. దీంతో రియో పట్టణంలోని ఉత్తర ప్రాంతం వణికిపోయింది. సుమారు 64 మంది ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 2500 మంది భద్రతా సిబ్బంది.. డ్రగ్ ట్రాఫికింగ్ ముఠాలపై రెయిడ్స్ నిర్వహించారు. సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, డ్రోన్లతో పోలీసులు ఆ ఆపరేషన్ నిర్వమించారు. నార్తర్న్ బ్రెజిల్లో ఉన్న రెండు మురికివాడల్లో ఆ తనిఖీలు నిర్వహించారు.
రియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో గన్‌ఫైర్ శబ్ధాలు వినిపించాయి. అనేక ప్రాంతాల నుంచి నల్లటి పొగ కమ్ముకున్నది. డ్రగ్ ముఠాలకు చెందిన బృందాలతో డ్రోన్లతో ప్రతిదాడులకు దిగినట్లు పోలీసులు ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్ అని గవర్నర్ క్లాడియో క్యాస్ట్రో తెలిపారు.
వివిధ గ్యాంగ్‌లకు చెందిన సుమారు 60 మంది అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లు క్యాస్ట్రో వెల్లడించారు. డ్రగ్ రెయిడ్‌లో నలుగురు పోలీసు ఆఫీసర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.