Bishnoi gang | కెనడా (Canada)లో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అక్కడ భారత సంతతి వ్యక్తులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆ దేశంలో భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి (Darshan Singh Sahasi) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇది తమ పనేఅని బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా ప్రకటించింది. బిష్ణోయ్ గ్యాంగ్‌లో సభ్యుడైన గోల్దీ ధిల్లాన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ గాయకుడి (Punjabi singer) ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు తెగబడింది. కెనడాలోని పంజాబీ గాయకుడు చాని నట్టన్ (Chani Nattan) ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఇది తమ పనేఅని గోల్దీ వెల్లడించారు. గాయకుడు సర్దార్ ఖేరాతో నట్టన్కు పెరుగుతున్న సాన్నిహిత్యం కారణంగానే అతడిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. ఖేరాతో కలిసి పనిచేసే ఏ గాయకుడినైనా తాము లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇక కాల్పుల ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Hurricane Melissa | కరీబియన్ ద్వీప దేశాలపై విరుచుకుపడుతున్న హరికేన్ మెలిసా.. ఏడుగురు మృతి
Brazil: బ్రెజిల్లో డ్రగ్ ముఠాలపై దాడులు.. 64 మంది మృతి
Apple: జోరుగా ఐఫోన్ అమ్మకాలు.. యాపిల్ కంపెనీ విలువ 4 ట్రిలియన్ డాలర్లు