Hurricane Melissa | కరీబియన్ దీవులను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హరికేన్ (Hurricane Melissa) వణికిస్తోంది. గడచిన 174 ఏళ్లలో ఎన్నడూ చూడని అత్యంత భీకర తుఫాన్ జమైకా (Jamaica)పై విరుచుకుపడింది. తుఫాన్ తాకిడికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ తుఫాను జమైకా గుండా క్యూబాలోని రెండో అతిపెద్ద నగరమైన శాంటియాగో డి క్యూబా (Cuba) వైపు దూసుకెళ్తోంది. ఈ తుఫాను దాటికి కరీబియన్ ద్వీప దేశాలు (Caribbean island nation) వణికిపోతున్నాయి. కరీబియన్ సముద్ర తీరం వెంబడి ఉన్న అనేక దేశాలపై మెలిస్సా విరుచుకుపడుతోంది. 295 కిలోమీటర్ల వేగంతో గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ఇక ఈ తుఫాను ధాటికి ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జమైకాలో ముగ్గురు, హైతీలో ముగ్గురు, డొమినికన్ రిపబ్లిక్లో ఒకరు చొప్పున మరణించారు. బ్లాక్ నదిలో మూడు కుటుంబాలు తమ ఇళ్లలో చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని రక్షించేందుకు కూడా వీలు పడలేదు. సిబ్బంది వారిని చోరుకోలేకపోతున్నారని పేర్కొంది. దాదాపు 15 వేల మంది తమ ఇళ్లను ఖాళీ చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అధికారులు అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మెలిసా హరికేన్‌ను అయిదో కేటగిరీ తుఫాన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
Praneeth Kumar Usiripalli: విమానంలో మైనర్లపై ఫోర్క్‌తో దాడి కేసులో భారతీయుడి అరెస్టు
Amazon | అమెజాన్‌లో 30 వేల ఉద్యోగాల కోత.. ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న సంస్థ
Hair Fall | 20 రోజుల్లో వెంట్రుకలను మొలిపించే సీరం!