న్యూఢిల్లీ: బట్టతలతో బాధపడుతున్న వారందరికీ తైవాన్‌లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక శుభవార్త చెప్పారు. వీరు కనుగొన్న ఒక సరికొత్త ‘సీరం’తో కేవలం 20 రోజుల్లో బట్టతలపై వెంటుక్రల్ని తిరిగి మొలిపించవచ్చునని తేలింది. పరిశోధకులు ఎలుకలపై జరిపిన ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయట. ఇక మిగిలింది.. క్లినికల్ ట్రయల్స్.
ఈ దశలోనూ వారు కనుగొన్న పద్ధతి, తయారుచేసిన ‘సీరం’ సురక్షితమేనని తేలితే.. మానవులకు ఈ అద్భుతమైన ఔషధం అందుబాటులోకి వస్తుంది. దీనిపై ‘సెల్ మెటబాలిజం’ కథనం ప్రకారం, జుట్టు ఊడిన చోట తిరిగి పెరిగేట్టు చేయటంలో తాజా అధ్యయనం కొత్త దారిని చూపింది. ఎలుకలపై ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి.