న్యూఢిల్లీ: యాపిల్(Apple) సంస్థ దూసుకెళ్తున్నది. తాజాగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ల డాలర్లు దాటింది. కొత్త ఐఫోన్ మోడల్స్ అమ్మకాల జోరు పెరగడంతో.. యాపిల్ కంపెనీ షేర్లు కూడా దూసుకెళ్తున్నాయి. యాపిల్ కంపెనీ చరిత్రలో 4 ట్రిలియన్ మార్కెట్ వాల్యూను చేరుకోవడం ఇదే తొలిసారి. ఆ మైలురాయి అందుకున్న మూడవ టెకీ కంపెనీగా యాపిల్ సంస్థ నిలిచింది. గతంలో ఈ రికార్డు అందుకున్న కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, నిదియా ఉన్నాయి.
సెప్టెంబర్ 9వ తేదీన కొత్తగా రిలీజైన ఐఫోన్ల అమ్మకాల వేగం పెరగడంతో యాపిల్ కంపెనీ షేర్లు అప్పటి నుంచి 13 శాతం వృద్ధి సాధించాయి. దీంతో స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా ముందుకెళ్తున్నది. బుధవారం ఉదయం యాపిల్ కంపెనీ షేర్లు 0.4 శాతం పెరిగాయి. గడిచిన జూలైలో మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ అందుకున్నది.
ఆ కంపెనీ షేర్లు రెండు శాతం పెరిగాయి. ఐఫోన్ 17 సిరీస్‌కు డిమాండ్ అధికంగా ఉండడంతో.. ఆ కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి.