Loksabha Elections 2024 : జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా బుధవారం యూపీలోని మహరాజ్‌గంజ్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం రాహుల్, అఖిలేష్‌లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఓటమికి ఈవీఎంలే కారణమని నిందిస్తారని చెప్పారు.
తమ ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెట్టివేయాలని వారు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ఎద్దేవా చేశారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమని, పీఓకేను బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని, పీఓకే గురించి మాట్లాడవద్దని కాంగ్రెస్ దేశాన్ని భయపెడుతున్నదని అన్నారు. తాము బీజేపీ వ్యక్తులమని, అణుబాంబులకు భయపడబోమని, పీఓకేను తిరిగి వెనక్కితీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read More :