రాయ్పూర్ : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతుందని, ఎన్నికల హామీలను (Chhattisgarh Polls) ఆ పార్టీ ఎన్నడూ నెరవేర్చదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొండగావ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ ఎన్నడూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని, నెరవేర్చని హామీలతో వారిని మోసగిస్తుందని ఆరోపించారు.
నక్సలిజంను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చత్తీస్గఢ్లో నక్సలిజం పెరిగిందని, కానీ గతంలో బీజేపీ పాలనలో నక్సలిజాన్ని ఏకంగా 70 శాతం తగ్గించగలిగామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నక్సల్స్ సమస్యను రూపుమాపుతామని, బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భూపేష్ బాఘెల్ మద్యం షాపులు ఓపెన్ చేయడం, స్కాముల్లో మునిగితేలడం, బొగ్గు కుంభకోణానికి తెరలేపడం మినహా ప్రజలకు చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మహదేవ్ యాప్ వంటి అవినీతి, కుంభకోణాలు లెక్కకు మిక్కిలిగా చోటుచేసుకున్నాయని మండిపడ్డారు.
Read More :
MLC Kavitha | రాహుల్ గాంధీ మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు: ఎమ్మెల్సీ కవిత