MLC Kavitha | రాహుల్ గాంధీ మాటలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు: ఎమ్మెల్సీ కవిత
రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
ఆర్మూర్: రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఆర్మూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 365 రోజుల పాటు చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు.
రైతులంటే కాంగ్రెస్ పార్టీకి చిన్నచూపని విమర్శించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. ఆయన రేవంత్ రెడ్డి కాదని, రేటెంత రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శుష్క వాగ్ధానాలతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. విభజన హామీలపై కేంద్రాన్ని ఏనాటూ ప్రశ్నించలేదన్నారు.
సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, తాడిచర్ల లాంటి గనులను ప్రైవేటు పరం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కేంద్రం కోల్ బ్లాకులను వేలం వేస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూసిందన్నారు. కుటుంబ రాజకీయాల గురించి ప్రియాంక గాంధీ మాట్లాడటం పెద్ద జోక్ అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మోతీలాల్ కొడుకు నెహ్రూ.. జవహర్లాల్ కూతురు ఇందిరా.. ఆమె కొడుకు రాజీవ్.. ఆయన కూతురు ప్రియాంక అని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

