హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న సుమారు 2,750 మంది ఉద్యోగులను ఏజెన్సీ వ్యవస్థ నుంచి తొలగించి పాత కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల భవిష్య నిధి డబ్బు లు జమ కాలేదని, ఆ మొత్తాన్ని వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలను ఈనెల 31లోగా చెల్లించకుంటే ఏప్రిల్ 1 నుంచి విధులకు గైర్హాజరవుతామని హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో పరిశుభ్రతతోపాటు, విద్యార్థుల మెనూ అమల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఎస్సీ గురుకుల సొసైటీ విజయేందిర బోయి ఆదేశించారు. షేక్‌పేటలోని ఎస్సీ బాలుర జూనియర్ గురుకుల కళాశాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని పరిశుభ్రతను పరిశీలించారు. కిచెన్‌ను తనిఖీ చేశారు. విద్యార్థుల ఫలితాలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలను ప్రిన్సిపాల్ బాలస్వామిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లోనూ ఆకస్మిత తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.