Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని ఎత్తయిన గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివెళ్తున్నారు. అయితే, తాజాగా ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది (temporarily suspended). ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న (heavy rain) కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. బాల్తాల్ (Baltal), పహల్గాం (Pahalgam) మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్రికుల భద్రత నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమైన విషయం తెలిసిందే. 3,800 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో మంచు లింగాన్ని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఇప్పటివరకు 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా. యాత్రను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో భద్రతను పెంచారు. కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీటీ, పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీన ముగియనుంది. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించారు.
Also Read..
Hathras stampede | హథ్రస్ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?
Mini Brain | 3డీ మ్యాపింగ్.. వివిధ వ్యక్తుల మూలకణాలతో మినీ బ్రెయిన్