Hathras stampede | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్(Hathras) తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనపై సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా (Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న అతను ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు.
జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
#WATCH | Hathras Stampede Accident | Mainpuri, UP: In a video statement, Surajpal also known as ‘Bhole Baba’ says, “… I am deeply saddened after the incident of July 2. May God give us the strength to bear this pain. Please keep faith in the government and the administration. I… pic.twitter.com/7HSrK2WNEM
— ANI (@ANI) July 6, 2024
అసలేం జరిగిదంటే..
జూలై 2న భోలే బాబా (Bhole Baba) అనే పేరుతో ప్రాచూర్యం పొందిన ఓ ఆధ్యాత్మికవేత్త హథ్రస్ జిల్లాలోని ఫూల్రాయ్ గ్రామంలో ‘సత్సంగ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు, అనుచరులు హాజరయ్యారు. వారిని ఉద్దేవించి భోలే బాబా తన ప్రవచనాన్ని ఇచ్చారు. కార్యక్రమం పూర్తవుతుండగా ఒక్కసారిగా పెనుగులాట చోటుచేసుకుంది. భోలే బాబా పాదాలను తాకాలని భక్తులు పరుగెత్తారు.
దీంతో అనేక మంది కింద పడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కింద పడ్డ వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరి అందక ఆర్తనాదాలు చేస్తూ చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారు. తొక్కిసలాటపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
Also Read..
Hathras Stampede | హత్రాస్ తొక్కిసలాట.. పోలీసుల ఎదుట లొంగిపోయిన ప్రధాన నిందితుడు
GHMC | నేడు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం.. అస్త్రశస్ర్తాలతో సిద్ధమైన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు