Storm Devin | అమెరికాలో ప్రస్తుతం హాలిడే సీజన్ నడుస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ఉన్నాయి. దీనికి తోడు శీతాకాలం కావడంతో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ప్రజలు హాలిడేను ఎంజాయ్ చేసేందుకు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. అయితే, ఈ సెలవుల వేళ వింటర్ స్టార్మ్ (US winter storms) బీభత్సం సృష్టిస్తున్నాయి. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ‘డెవిన్’ అనే భారీ మంచు తుపాను (Storm Devin) అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ ముగిసిన వెంటనే విరుచుకుపడటంతో ప్రయాణ (holiday travel) వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ తుపాను కారణంగా దాదాపు 1,800కిపైగా విమానాలు రద్దయ్యాయి (flights cancel). 10 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 1,802 విమానాలు రద్దుకాగా, 22,349 ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, లాగ్వార్డియా విమానాశ్రయం, డెట్రాయిట్ మెట్రోపాలిటన్ వేన్ కౌంటీ విమానాశ్రయం సహా ఈశాన్య, మిడ్‌వెస్ట్‌లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ ఒక్కటే తన షెడ్యూల్లో 22 శాతం అంటే సుమారు 225కు పైగా విమానాలను రద్దు చేసింది. ఇతర ప్రధాన విమానయాన సంస్థలు కూడా వందలాది సర్వీసులను నిలిపివేశాయి. డెల్టా ఎయిర్‌లైన్స్ 186 విమానాలను, రిపబ్లిక్ ఎయిర్వేస్ 155 విమానాలను, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 96, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 82 విమానాలను రద్దు చేసింది.
తుపాను ప్రభావం న్యూయార్క్ నగరంతో పాటు లాంగ్ ఐలాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, ఉత్తర న్యూజెర్సీ ప్రాంతాలపై అధికంగా ఉంది. జాతీయ వాతావరణ విభాగం (NWS) సుమారు 2.3 కోట్ల మందికి వింటర్ స్టార్మ్ హెచ్చరికలు జారీ చేసింది. న్యూయార్క్ నగరంలో 4 నుంచి 8 అంగుళాల మంచు కురుస్తుందని, ఇతర ప్రాంతాల్లో అడుగు వరకు హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈశాన్య ప్రాంతంలో చాలా వరకు మంచు, తుపాను హెచ్చరికలు జారీ చేసింది.
Also Read..
Massive Pile Up | ఘోర ప్రమాదం.. 50 వాహనాలు ఢీ.. ఎగసిపడ్డ మంటలు.. షాకింగ్ వీడియో
Kohinoor Diamond | లండన్‌లో మళ్లీ నిరసనలు.. కోహినూర్ వజ్రం మళ్లీ భారత్ చేరేనా?
Bangladesh | బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. మూకదాడితో రాక్ స్టార్ కాన్సర్ట్ రద్దు