Massive Pile Up | జపాన్ (Japan)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (Massive Pile Up). ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచు వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. రాజధాని టోక్యో (Tokyo)కు వాయువ్యంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాకామి పట్టణంలోని కాన్-ఎట్సు ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం అర్ధరాత్రి రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఆ తర్వాత దాదాపు 50 వాహనాలు (50 Vehicles) వెనుక నుంచి ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నట్లు గున్మా ప్రిఫెక్చురల్ హైవే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో టోక్యోకు చెందిన 77 ఏళ్ల మహిళ మరణించగా.. సుమారు 26 మంది గాయపడ్డారు.
ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండటంతో పలు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో పలు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Japan: Major accident on Kanetsu Expressway outbound line in Minakami Town, Gunma Prefecture, several injured – NHKpic.twitter.com/QJb9qu9szx
— Volcaholic 🌋 (@volcaholic1) December 26, 2025
Also Read..
Bangladesh | బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. మూకదాడితో రాక్ స్టార్ కాన్సర్ట్ రద్దు
Kohinoor Diamond | లండన్‌లో మళ్లీ నిరసనలు.. కోహినూర్ వజ్రం మళ్లీ భారత్ చేరేనా?
అవినీతి కేసులో దోషిగా మలేషియా మాజీ ప్రధాని