ముంబై: సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ క్రికెటర్లు ఎంత జీతం తీసుకుంటారో తెలుసా? దేశవాళీ వన్డే టోర్నీలో ఆ మేటి ప్లేయర్లకు ఎంత శాలరీ వస్తుందో తెలుసుకుందామా? వాస్తవానికి ప్రీమియర్ లీగ్‌లో వచ్చినంత ఈ టోర్నీలో ఆడే క్రికెటర్లకు పేమెంట్ ఉండదు. కానీ సీనియర్ ప్లేయర్లకు మాత్రం బాగానే శాలరీ ఇస్తారు. ప్రొఫెషనల్ అనుభం ఆధారంగా క్రికెటర్లకు పేమెంట్ ఉంటుంది. ఐపీఎల్లో ఆటగాళ్లను వేలం ద్వారా కొనుగోలు చేస్తారు. కానీ విజయ్ హజారే ట్రోఫీ ఆడే క్రికెటర్లకు మాత్రం శాలరీ ఫిక్స్‌గా ఉంటుంది. లిస్ట్ ఏ అంటే దేశవాళీ వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్ని పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే సీనియర్లు విరాట్, రోహిత్‌లకు విజయ్ హజారే ట్రోఫీలు జీతం ఎక్కువగానే ఉంటుంది.
ఈ టోర్నీ కోసం మూడు కేటగిరీల్లో శాలరీని ఫిక్స్ చేశారు. సీనియర్ కేటగిరీలో 40 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడినవాళ్లకు శాలరీ ఇస్తారు. అంటే స్వదేశీ వన్డేలు 40 ఆడిన క్రికెటర్లకు ప్రతి మ్యాచ్‌లో 60 వేలు ఫీజు ఇస్తారు. ఒకవేళ ఆ కేటగిరీ ప్లేయర్ రిజర్వ్‌లో ఉంటే అతనికి 30 వేల శాలరీ ఇస్తారు. ఇక మిడ్‌లెవల్ కేటగిరీలో 21 నుంచి 40 వరకు లిస్టు ఏ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు ప్రతి మ్యాచ్‌లో 50 వేలు ఇస్తారు. ఒకవేళ ప్లేయర్ రిజర్వ్ లో ఉంటే అతనికి 25 వేలు ఇస్తారు. మూడవది జూనియర్ కేటగిరీ. దీంట్లో 20 మ్యాచ్‌లు ఆడే ప్లేయర్లకు ప్రతి మ్యాచ్‌లో 40 వేల ఫీజు ఇస్తారు. జూనియర్ కేటగిరీలో ఉన్న రిజర్వ్ ప్లేయర్లకు 20 వేలు శాలరీ ఇస్తారు.
ప్రస్తుత సీజన్లో కోహ్లీ, రోహిత్‌లు లిస్ట్ ఏ కేటగిరీలోనే వస్తారు. ఇద్దరూ 40 కన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. అంటే ఇద్దరికీ ఒక్కొక్క మ్యాచ్‌లో 60 వేలు శాలరీ వస్తుంది. అయితే అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడితే బీసీసీఐ ఒక్కొక్కరికి ఆరు లక్షలు ఇస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన క్రికెటర్‌కు పది వేల క్యాష్ ప్రైజ్ అదనంగా ఇస్తారు. కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ క్రికెటర్లు విజయ్ హజారే టోర్నీలో బాగా రాణిస్తే వాళ్లకు అదనంగా పేమెంట్ కూడా ఉంటుంది.