తొగుట, డిసెంబరు 27: సిద్దిపేట జిల్లా తొగుట మండల సర్పంచ్ల ఫోరాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అధ్యక్షులుగా ఘనపూర్ సర్పంచ్ గంగసాని రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని గుడికందులలో శుక్రవారం రాత్రి సర్పంచ్ కన్నయ్యగారి లక్ష్మి నివాసంలో మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ సోసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు దోమల కొమురయ్య, బక్క కనకయ్య, మాజీ రైతు బంధు మండల అధ్యక్షులు బోధనం కనకయ్య లతో కలిసి సర్పంచ్ల సమావేశం నిర్వహించి ఫోరాన్ని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా కోల వెంకటస్వామిగౌడ్ (బండారుపల్లి), ఉపాధ్యక్షులుగా నంట సమీర పరమేశ్వర్‌రెడ్డి (గోవర్ధనగిరి), ప్రధాన కార్యదర్శిగా బండారు కవిత స్వామిగౌడ్ (వెంకట్రావుపేట), కోశాధికారిగా చంద లావణ్య స్వామి (చందాపూర్), కార్యవర్గ సభ్యులుగా బక్క కనకయ్య (చందాపూర్), కే లక్ష్మి (గుడికందుల), పన్యాల ప్రవీణ్ రెడ్డి (పెద్దమాసాన్‌పల్లి), పిట్ల నర్సింలు (ఎల్ బంజేరుపల్లి), ఎర్వ గోపాల్ రెడ్డి (వర్ధరాజ్ పల్లి)లను ఎన్నుకున్నారు. తనపై ఎంతో విశ్వాసంతో ఫోరం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి, ఇతర సర్పంచ్‌లకు గంగసాని రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ల సమస్యలపై పోరాటం సాగిస్తామని, వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు.