Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా భక్తులు (pilgrims) మంచులింగాన్ని దర్శించుకున్నారు. జులై 2న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జులై 8వ తేదీ వరకూ 1.11 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
మరోవైపు బుధవారం ఉదయం జమ్ములోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి 7,579 మంది భక్తులతో కూడిన మరో బ్యాచ్ అమర్నాథ్ గుహలకు బయల్దేరి వెళ్లింది. వీరిలో 3,031 మంది బాల్తాల్ బేస్ క్యాంప్‌కు, 4,548 మంది పహల్గామ్ బేస్ క్యాంప్‌కు ప్రత్యేక భద్రతా కాన్వాయ్‌ల మధ్య తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జులై 2న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు జమ్ము ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించింది. దీంతో యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
Google AI Mode | భారత్‌లో అందుబాటులోకి గూగుల్ ఏఐ మోడ్
IndiGo | పక్షి ఢీ కొనడంతో విమానం అత్యవసర ల్యాండింగ్
Homes Swept Away | మెక్సికోలో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు.. షాకింగ్ వీడియోలు