IndiGo | ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight) పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది. విమానం పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో సురిక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో 6E509 విమానం పాట్నా నుంచి ఢిల్లీకి బయల్దేరింది. పాట్నాలోని జయ ప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8:42 గంటలకు టేకాఫ్ అయ్యింది. అయితే టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో వైబ్రేషన్స్ రావడాన్ని గమనించిన పైలట్ వెంటనే అధికారులను సంప్రదించారు. అనంతరం విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్ట్‌లోని రవ్వే 7లో ఉదయం 9:03 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఆ సమయంలో విమానంలో దాదాపు 169 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పక్షి ఢీ కొనడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల సమయంలో ఎయిర్పోర్ట్ రన్‌వేపై చనిపోయిన పక్షిని గుర్తించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Homes Swept Away | మెక్సికోలో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు.. షాకింగ్ వీడియోలు
Nitin Gadkari | ఢిల్లీలో నేను ఉండలేను.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుంది : నితిన్ గడ్కరీ
Bridge Collapses | కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి.. VIDEO