Google AI Mode | భారత్‌లో అందుబాటులోకి గూగుల్ ఏఐ మోడ్
Google AI Mode | ప్రస్తుతం ఆన్లైన్లో ఏ సమాచారం కావాలన్నా.. ‘గూగుల్ సెర్చ్’ (Google) ఓపెన్ చేయాల్సిందే!
Google AI Mode | ప్రస్తుతం ఆన్లైన్లో ఏ సమాచారం కావాలన్నా.. ‘గూగుల్ సెర్చ్’ (Google) ఓపెన్ చేయాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 శాతం మందికి ఇదే పెద్దదిక్కు. ప్రతిరోజూ 850 కోట్ల శోధనలను ప్రాసెస్ చేస్తుంది. యూజర్లు అడిగిన సమాచారాన్ని.. సంబంధిత వెబ్‌లింక్‌లను వెతికి ఇస్తుంది. అయితే, చాట్‌జీపీటీ రాకతో గూగుల్ కూడా ‘ఏఐ’ వైపు (Google AI Mode) అడుగులు వేసింది. తన సెర్చ్ ఇంజిన్‌కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానం చేసింది.
ఇప్పటికే అమెరికాలో విడుదలై విజయవంతంగా సేవలు అందిస్తున్న ‘గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్’ ఇప్పుడు భారత్ (India)లోనూ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సైన్అప్స్ చేయకుండానే డైరెక్ట్‌గా మొబైల్, వెబ్ వెర్షన్లలో ఏఐ ఆధారిత శోధనలు చేసుకోవచ్చు. ఇప్పటివరకు గూగుల్‌లో ఏదైనా వెతికితే.. అందుకు సంబంధించిన వెబ్‌లింక్‌లు మాత్రమే వచ్చేవి. కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు దొరికేవి కాదు. కానీ, ఈ సరికొత్త ఏఐ మోడ్ టూల్‌తో.. ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం దొరుకుతుంది.
వినియోగదారుల మనసులో ఏమున్నా.. గూగుల్‌ను నేరుగా అడగొచ్చు. వాటికి గూగుల్ ఏఐ టూల్ ‘జెమిని’ సహాయంతో సమాధానాన్ని అందిస్తుంది. అందుకే, ఈ గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్‌ను ‘జెమిని 2.5’ (Google’s Gemini 2.5 model) వెర్షన్‌గా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందించనున్నది.
Also Read..
Homes Swept Away | మెక్సికోలో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు.. షాకింగ్ వీడియోలు
Nitin Gadkari | ఢిల్లీలో నేను ఉండలేను.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనే ఉంటుంది : నితిన్ గడ్కరీ
Road Washed | భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రోడ్డు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

