IndiGo | నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతోంది. వరుసగా నాలుగోరోజూ 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి రాజధాని ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో విమానాలు రన్వేకే పరిమితమయ్యాయి.
తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport) నుంచి బయల్దేరే అన్ని ఇండిగో దేశీయ విమాన సర్వీసులు (Domestic Flights) రద్దయ్యాయి. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. అర్ధరాత్రి వరకూ అన్ని విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకే ఫ్లైట్ క్యాన్సిలేషన్లు ఉంటాయని డీజీసీఏ వెల్లడించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
ఇండిగో సంక్షోభం వేళ ఇతర విమానాల టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. ప్రత్యామ్నాయ ఎయిర్‌లైన్స్ టిక్కెట్ల ధరలకే భారీగా పెంచాయి. దీంతో ప్రయాణికుల విమాన ప్రయాణం మరింత భారంగా మారింది. దీంతో పలువురు తమ గమ్య స్థానాలకు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read..
Rahul Gandhi | ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. ఇండిగో వైఫల్యంపై రాహుల్
Indigo Flights: ఇండిగో విమానాలు రద్దు.. స్వంత రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన టెకీ జంట
IndiGo | వరుసగా నాలుగోరోజూ.. 400కిపైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు