Indigo Flights: ఇండిగో విమానాలు రద్దు.. స్వంత రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన టెకీ జంట
IndiGo Flights: అకస్మాత్తుగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. అనేక మంది ఇబ్బందిపడుతున్నారు. కర్నాటకకు చెందిన ఓ టెకీ జంట కూడా తమ స్వంత రిసెప్షన్‌కు హాజరుకాలేకపోయింది. దీంతో వాళ్లు వర్చువల్‌గా పెళ్లి రిసెప్షన్లో పాల్గొన్నారు.
బెంగుళూరు : గడిచిన నాలుగు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు(Indigo Flights) వందల సంఖ్యలో రద్దు అవుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వందల సంఖ్యలో ప్రయాణికులు అనుకున్న సమయానికి ఇంటికి చేరుకోలేకపోతున్నారు. ఇక కర్నాటకు చెందిన ఓ జంట కూడా తమ స్వంత రిసెప్షన్‌కు నేరుగా హాజరుకాలేకపోయింది. ఇండిగో విమానాల రద్దుతో.. ఆ జంట తమ రిసెప్షన్‌కు ఆన్లైన్లోనే హాజరైంది. ఈ ఘటనకు చెందిన వివరాల్లోకి వెళ్తే.
కర్నాటకలోని హుబ్లీలో అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. కొత్తగా ఒక్కటైన ఓ జంట తమ స్వంత రిసెప్షన్‌కు వర్చువల్‌గా హాజరుకావాల్సి వచ్చింది. ఇండిగో విమానాల రద్దుతో.. ఆ కొత్త జంట అనుకున్న సమయానికి రిసెప్షన్‌కు దూరం కావాల్సి వచ్చింది. హుబ్లీకి చెందిన మేధా కృష్సాగర్, భువనేశ్వర్‌కు చెందిన సంగ్మాదాస్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. బెంగుళూరులో పనిచేస్తున్నారు. హుబ్లీలోని గుజరాత్ భవన్లో వాళ్ల రిసెప్షన్ జరగాల్సి ఉంది.
ఈ కొత్త జంట నవంబర్ 23వ తేదీన భువనేశ్వర్‌లో పెళ్లాడారు. అయితే బుధవారం అమ్మాయి ఇంటి వద్ద ఫార్మల్గా రిసెప్షన్ నిర్వహించారు. అబ్బాయి ఇంటి దగ్గర జరగాల్సిన రిసెప్షన్ .. విమానాల రద్దుతో గందరగోళంలో పడింది. డిసెంబర్ 2వ తేదీన భువనేశ్వర్ నుంచి బెంగుళూరుకు కొత్త జంట విమాన టికెట్లు బుక్ చేసింది. కానీ మంగళవారం విమానాలు ఆలస్యం అయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీన వాటిని ఏకంగా రద్దు చేశారు. భువనేశ్వర్ నుంచి ముంబై మీదుగా హుబ్లీ వెళ్తున్న అనేకమంది బంధువులు కూడా ఇండిగో తాకిడికి గురయ్యారు. రిసెప్షన్ వేదిక వద్దకు అతిథులు చేరుకోవడంతో.. ఆ సమయంలో కొత్త జంట వర్చువల్‌గా ఆ ఈవెంట్లో పాల్గొన్నది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన వధూవరులు భువనేశ్వర్ నుంచి రిసెప్షన్లో పాల్గొన్నానరు. నవంబర్ 23వ తేదీన పెళ్లి చేసుకున్న ఆ జంట డిసెంబర్ 3వ తేదీన రిసెప్షన్ పెట్టుకున్నది. కానీ ఇండిగో విమానాల రద్దు వల్ల ఆ ఈవెంట్‌ను కాస్త వర్చువల్‌గా నిర్వహించాల్సి వచ్చింది.
A newly wed techie couple forced to attend their own reception online after their Indigo flights from Bhubaneswar-Hubbali were cancelled. The bride’s parents having already invited relatives decided to broadcast their live feed on a big screen. #IndigoDelay #FlightCancellations pic.twitter.com/jO7lTgm8lZ
— Deepak Bopanna (@dpkBopanna) December 5, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

