బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 15:14:52

ఏఐఐఏలో కొవిడ్‌ చికిత్స ప్రారంభం

ఏఐఐఏలో కొవిడ్‌ చికిత్స ప్రారంభం

న్యూ ఢిల్లీ: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) తన కొవిడ్‌-19 ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ) లో  రోగులకు ఉచిత పరీక్ష, చికిత్సను ప్రారంభించింది. ఈమేకు కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ పాద యశోనాయక్‌ ప్రకటించారు. కొవిడ్ -19 రోగుల చికిత్స కోసం కేంద్రంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆయన సీహెచ్‌సీని సందర్శించారు. సీహెచ్‌సీలో రోగులందరికీ ఉచితంగా పరీక్ష, చికిత్స సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వెంటిలేటర్ , ఐసీయూ, ఇతర ప్రామాణిక నిబంధనలతో కూడిన సీహెచ్‌సీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. 

ఏఐఐఏను కొవిడ్‌-19 పరీక్షా కేంద్రంగా (ఆర్‌టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌) ఢిల్లీ ప్రభుత్వం వాడుకుంటున్నది. అలాగే, కరోనా వైరస్‌కు సంబంధించి సాధారణ ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఇందులో కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా, మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 80 వేల మంది ఢిల్లీ పోలీసుల్లో రోగనిరోధక శక్తి పెంపుకోసం ‘ఆయురక్షా’ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకుగానూ ఏఐఐఏను మంత్రి శ్రీపాద నాయక్‌ అభినందించారు.    


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo