Akash Ambani | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Akash Ambani) పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆకాశ్ అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆకాశ్ అంబానీ తిరుమలలోని ఎస్వీ గోశాలను సందర్శించారు. అక్కడ గోపూజ చేసి.. గోమాతకు దాణ సమర్పించారు.
#WATCH | Andhra Pradesh: Akash Ambani, Director, Reliance Industries Limited, visited Tirumala to offer prayers before Lord Venkateswara. pic.twitter.com/GwQ0mlIg7t
— ANI (@ANI) April 2, 2025
Also Read..
Savitri Jindal: భారతీయ అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్.. ఆమె ఆస్తులెంతంటే ?
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో సీటు కోసం చర్చ.. వ్యక్తితో మహిళల వాగ్వాదం.. VIDEO