Ajit Pawar | రానున్న లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections) మహారాష్ట్రలో రసవత్తరంగా మారనున్నాయి. ముఖ్యంగా బారామతి (Baramati) లో పవార్ కుటుంబం ( Pawar family) మధ్య గట్టి పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ (Ajit Pawar) తిరుగుబాటు చేసి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. దీంతో పవార్ కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బారామతిలో పవార్ కుటుంబ సభ్యుల మధ్య హోరాహోరీ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బారామతికి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సూలేపై అభ్యర్థిని నిలబెట్టే యోచనలో అజిత్ పవార్ ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar)ను బారామతి నుంచి సూలేపై బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
కాగా, బారామతి లోక్‌సభ స్థానంలో ఐదు దశాబ్దాలుగా పవార్ కుటుంబం జెండా ఎగురవేస్తోంది. ఇక్కడ 1967, 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ బారామతి నుంచే గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 1984, 1996,1998, 1999, 2004లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక గత మూడు దఫాలుగా సుప్రియా సూలే బారామతి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 నుంచి సుప్రియా సూలే వరుగా ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే, ఈసారి మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎన్సీపీ రెండు ముక్కలు కావడం, ఎన్సీపీ సభ్యులు కొందరు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో రాజకీయ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
Also Read..
Imran Khan | పాకిస్థాన్ పార్లమెంట్లో ప్రతిపక్షంలో కూర్చోనున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ
Black Panther | ఇంటి ముంగిట చక్కర్లు కొట్టిన బ్లాక్ పాంథర్.. వీడియో
Garlic price | కిలో రూ.500కు చేరిన ఎల్లిగడ్డ.. పొలాల్లో సీసీ కెమెరాలు పెడుతున్న రైతులు..!