Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఈ-ఇన్సాఫ్ (PTI) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పార్లమెంట్ (Pakistans Parliament)లో ప్రతిపక్ష (Opposition) స్థానంలో కూర్చోవాలని నిర్ణయించింది. ఇటీవలే జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సరైన వాతావరణం లేకపోవడంతో పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐకి చెందిన బారిస్టర్ అలీ సయూఫ్ ప్రకటించారు. పార్టీ తన ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉమర్ అయూబ్ ఖాన్, పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అస్లాం ఇక్బాల్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత పీటీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇస్లామాబాద్‌లో అలీ సయూఫ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ సూచనల మేరకు ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఓట్లు, సీట్లను తారుమారు చేయకుంటే నేడు తమ పార్టీకి 180 స్థానాలు వచ్చి ఉండేవని అన్నారు. మొత్తం 177 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నట్లు చెప్పారు. అయితే, వాటిలో 85 సీట్లను తమ నుంచి మోసపూరితంగా లాగేసుకున్నారని ఆరోపించారు. అందుకే తమ అభ్యర్థులు గెలిచినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read..
Joe Biden: నావల్నీ మృతికి పుతినే కారణం: బైడెన్
Computer chip | కాంతితో పనిచేసే కంప్యూటర్ చిప్.. హ్యాక్ అవదని చెప్తున్న శాస్త్రవేత్తలు..!