Air India : బోయింగ్ డ్రిమ్‌లైనర్ 787 విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ఎయిరిండియా (Air India) సంస్థ నష్టపరిహారం (Compensation) డబ్బులు విడుదల చేసింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 166 మంది ఫ్యామిలీస్‌కు మధ్యంతర పరిహారంగా రూ.25 లక్షలు ఇచ్చింది. బాధిత కుటుంబాల ఖర్చులు, ఆర్ధిక అవసరాల కోసం ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్టు శనివారం సంస్థ వెల్లడించింది.
‘బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో 229 మంది చనిపోగా.. వీళ్లలో147 మంది కుటుంబాలకు ఎయిరిండియా నష్టపరిహారం చెల్లించింది. ఘటన స్థలంలో మృతి చెందిన 19 మంది ఫ్యామిలీస్‌కు కూడా పరిహారం అందజేసింది. అయితే.. ఈ ప్రమాదంలో మరణించిన మరో 52 మంది ప్రయాణికులకు సంబంధించిన కుటుంబీకుల పత్రాలను పరిశీలిస్తున్నాం. వీళ్లకు కూడా త్వరలోనే నష్టపరిహారం ముట్టజెప్పుతాం’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.
The head of the Federal Aviation Administration said on Thursday the fatal crash last month of Air India flight 171 does not appear to have been caused by a mechanical issue or inadvertent movement of the fuel control unit or switches.
“We can say with a high level of confidence… pic.twitter.com/mEeU0P2dxN
— Breaking Aviation News & Videos (@aviationbrk) July 25, 2025
జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకేఒక ప్రయాణికుడు బతికిబయటపడగా.. పైలట్లు,సిబ్బందితో అందరూ మరణించారు. దురదృష్టకరమైన ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఘటనతో దెబ్బతిన్న ఎంజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవన పునర్మిర్ణానికి ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమని చెప్పింది. అయితే.. మనదేశంలో ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటైన ఈ విషాదానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.