Asia Cup | ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్.. సెప్టెంబర్ 14న బిగ్‌ఫైట్..!
Asia Cup : ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమైన భారత్, పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్‌లో ఢీకొన్న ఇరుజట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీకి సిద్ధమవుతున్నాయి.
Asia Cup : ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమైన భారత్, పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్‌లో ఢీకొన్న ఇరుజట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాది జట్ల మ్యాచ్ సెప్టెంబర్ 14 ఆదివారం జరుగునుంది. శనివారం ఆసియా క్రికెట్ మండలి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.
తటస్థ వేదికపై ఈవెంట్ జరిపేందుకు బీసీసీఐ (BCCI) పచ్చజెండా ఊపిన మరునాడే ఏసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. టైటిల్ కోసం పోటీపడే ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. తమను ఒకే గ్రూప్‌లో ఉంచవద్దని బీసీసీఐ లేఖ రాసినప్పటికీ ఫలితం లేకపోయింది. భారత్, పాక్‌తో పాటు యూఏఈ, ఒమన్ జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, హాంకాంగ్ చోటు దక్కించుకున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో పొట్టి వర్డ్ కప్ నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌లోను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో 19 మ్యాచ్‌లు ఉంటాయి. లీగ్, సూపర్-4, ఫైనల్ మ్యాచ్ తేదీల విషయానికొస్తే..
JUST IN: India will play Pakistan on Sunday, September 14 in a group-stage fixture of the men’s Asia Cup pic.twitter.com/todacEzdZS
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
సెప్టెంబర్ 9, మంగళవారం – అఫ్గనిస్థాన్ vs హాంకాంగ్.
సెప్టెంబర్ 10, బుధవారం – భారత్ vs యూఏఈ.
సెప్టెంబర్ 11 గురువారం – బంగ్లాదేశ్ vs హాంకాంగ్.
సెప్టెంబర్ 12 శుక్రవారం – పాకిస్థాన్ vs ఒమన్.
సెప్టెంబర్ 13 శనివారం – బంగ్లాదేశ్ vs శ్రీలంక.
𝐓𝐡𝐞 𝐛𝐚𝐭𝐭𝐥𝐞 𝐟𝐨𝐫 𝐀𝐬𝐢𝐚𝐧 𝐬𝐮𝐩𝐫𝐞𝐦𝐚𝐜𝐲 𝐢𝐬 𝐛𝐚𝐜𝐤! 🏏
The ACC Men’s T20I Asia Cup kicks off from 9th to 28th September in the UAE! 🤩
Get ready for thrilling matchups as the top 8 teams in Asia face off for continental glory! 👊#ACCMensAsiaCup2025 #ACC pic.twitter.com/JzvV4wuxna
— AsianCricketCouncil (@ACCMedia1) July 26, 2025
సెప్టెంబర్ 14 ఆదివారం – భారత్ vs పాకిస్థాన్.
సెప్టెంబర్ 15 సోమవారం – శ్రీలంక vs హాంకాంగ్.
సెప్టెంబర్ 16 మంగళవారం – బంగ్లాదేశ్ vs అఫ్గనిస్థాన్.
సెప్టెంబర్ 17 బుధవారం – పాకిస్థాన్ vs యూఏఈ.
సెప్టెంబర్ 18 గురువారం – శ్రీలంక vs అఫ్గనిస్థాన్.
సెప్టెంబర్ 19 శుక్రవారం – భారత్ vs ఒమన్.

సూపర్ -4 మ్యాచ్‌ల షెడ్యూల్..
సెప్టెంబర్ 20 శనివారం – గ్రూప్ బీ క్వాలిఫయర్ 1 vs గ్రూప్ బీ క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 21 ఆదివారం – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 vs గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 23 మంగళవారం – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 vs గ్రూప్ బీ క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 24 బుధవారం – గ్రూప్ బీ క్వాలిఫయర్ 1 vs గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2.
సెప్టెంబర్ 25 గురువారం – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2 vs గ్రూప్ బీ క్వాలిఫయర్ 2.
సెప్టెంబర్ 26 శుక్రవారం – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 vs గ్రూప్ బీ క్వాలిఫయర్ 1.
ఫైనల్ – సెప్టెంబర్ 28 ఆదివారం.
ఇవి కూడా చదవండి
- Triptii Dimri | నీ పని అయిపోయినట్టే.. ఇండస్ట్రీలో అవుట్సైడర్స్పై తృప్తి డిమ్రి హాట్ కామెంట్స్
- Encounter | మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్కౌంటర్లో నలుగురు హతం..!
- Newlywed man becomes thief | భార్య విలాస కోరికలు తీర్చేందుకు.. దొంగగా మారిన కొత్తగా పెళ్లైన వ్యక్తి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

