Triptii Dimri | తృప్తి డిమ్రి (Triptii Dimri).. ఈ భామ సోషల్ మీడియాలో ఫొటో పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక హాట్ లుక్‌తో సందడి చేసే తృప్తి డిమ్రి యానిమల్‌లో అందాలు ఆరబోసి అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఈ బ్యూటీ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్‌లో నటించే ఛాన్స్ కొట్టేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
అయితే తృప్తి డిమ్రి ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ గురించి చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ చిట్‌చాట్‌లో తృప్తి డిమ్రి మాట్లాడుతూ.. అవుట్‌సైడర్స్ కు ఇండస్ట్రీలో మళ్లీ మళ్లీ అవకాశాలు రావన్నది. ఈ రోజు మనకు ఈ సినిమా ఉంటుంది.. రేపు మనందరికీ మరో సినిమా ఉంటుంది. కానీ దాని తర్వాత నెక్ట్స్ సినిమా కోసం మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే నీ సినిమాలతో మొదటి రెండు సార్లు తప్పు చేస్తే నీ పని అయిపోయినట్టే. అదే రియాలిటీ. అందువల్లే కథ పట్ల, మీ పాత్రల పట్ల పూర్తి స్థాయిలో నమ్మకం ఉండాలంటూ చెప్పుకొచ్చింది.
ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తృప్తి డిమ్రి ఖాతాలో ధడక్ 2తోపాటు మరో సినిమా ఉంది. పలు సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు బీటౌన్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
Gajwel | గజ్వేల్‌లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన