IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు కోలుకుంటోంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లతో కష్టాల్లో పడిన జట్టును ఆపద్భాందవుడు కేఎల్ రాహుల్ (51 నాటౌట్) ఆదుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (59 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. డాసన్ ఓవర్లో సింగిల్ తీసిన అతడు అర్ధ శతకం సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లను నేర్పుగా ఎదుర్కొంటూ.. సింగిల్స్, డబుల్స్‌తో జట్టు స్కోర్ వంద దాటించిందీ ద్వయం. ప్రస్తుతం భారత్ స్కోర్.. 118/2. ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది.
ఇంగ్లండ్ బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధించిన పిచ్ మీద కేఎల్ రాహుల్(51 నాటౌట్), శుభ్‌మన్ గిల్(59 నాటౌట్) అద్భుతంగా పోరాడుతున్నారు. జట్టును గట్టున పడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు సిద్దమైన జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇస్తారనుకుంటే సీన్ రివర్సైంది.
WHAT A START BY THE WIZARD! 🧙♂️
Two in two in the first over – India go in for lunch on 1 for 2 😱 pic.twitter.com/nuYGaVbDAX
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ కొత్త బంతితో నిప్పులు చెరుగుతూ యశస్వీ జైస్వాల్(0)ను, తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్(0)ను సున్నాకే ఔట్ చేసి పెద్ద షాకిచ్చాడు. ఆ తర్వాత రాహుల్, కెప్టెన్ గిల్ ఆచితూచి ఆడగా.. లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి ఒకే ఒక రన్ చేసింది భారత్. లంచ్ తర్వాత గిల్, రాహుల్ రిస్క్ తీసుకోకుండా ఆడుతూ రన్స్ పిండుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించారు. ఈ ఇద్దరూ సమయోచితంగా ఆడడంవతో టీ బ్రేక్ సమయానికి భారత్2 వికెట్లు కోల్పోయి 86 రన్స్ చేసింది.