Navin Mittal | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టులో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జెన్కో ఎండీ నవిన్ మిట్టల్‌ను ఏఐటీయూసీ (హెచ్64) జనరల్ సెక్రటరీ బీ లక్ష్మయ్య కోరారు. సీఎండీని శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, చైర్మన్ నవీన్ మిట్టల్, సీఎండీగా నియామకమైన హరీశ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ సంస్థలోని సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆర్టిజన్ కార్మికులకు లేబర్ కమిషనర్ సూచించిన ప్రకారం ఐదు సంవత్సరాలు పూర్తయిన వారికి ప్రమోషన్ కల్పించడం లేదని.. జాప్యం జరుగుతుందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్సీబీ సర్వీసులను వర్తింప చేయగలరని కోరారు. ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి.. కార్మికులకు న్యాయం చేయాలని రామయ్య, అధ్యక్షుడు పీ మల్లికార్జున్, కే కుమార్. ఎస్కే మబుల్ బాషా, రమణ, ఆర్ రామసుబ్బయ్య, మోషే గౌరీ. లక్ష్మీ చంద్రకళ, శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.