Air India | ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. విమానం గాల్లో ఉండగా.. అందులోని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పైలట్ విమానాన్ని జైపూర్ (Jaipur) మళ్లించారు. అక్కడ అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేశారు.
ఇవాళ ఉదయం ఎయిర్ ఇండియా విమానం AI-2571 ఢిల్లీ నుంచి విజయవాడ (Delhi to Vijayawada) బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. వారి అనుమతులతో విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. ఉదయం 6:45 గంటల సమయంలో విమానం జైపూర్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విమానం విజయవాడ బయల్దేరింది.
Also Read..
ISRO | పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం : ఇస్రో చైర్మన్
Service Charge | రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జిని విధించరాదు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
Masina Hospital | పైసలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం.. ముంబైలోని మసీనా దవాఖానలో దారుణం