ISRO | పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం : ఇస్రో చైర్మన్
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఇస్రో (ISRO) చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. ప్రయోగం మూడో దశ వరకు సాఫీగానే సాగినట్లు చెప్పారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. మూడో దశ చివర్లో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయినట్లు చెప్పారు. సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.
శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-62 (PSLV C-62) రాకెట్‌ను ఇవాళ ఉదయం ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా 14 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం బరువు 1,485 కేజీలు. దీనికి అన్వేష (Anvesha)గా నామకరణం చేశారు. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన శాటిలైట్‌లో అత్యంత అధునాతమైనది ‘ఈవోఎస్-ఎన్1’ (అన్వేష)ను రోదసిలోకి పంపుతున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది.
దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకమని, ఇది 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఇప్పటికే తెలిపారు. రోదసి నుంచి భారత్ నిఘా సామర్థ్యాల్ని పెంచేదిగా, భూమిపై ఓ కన్నేసి ఉంచటంగా ‘అన్వేష’ను సైంటిస్టులు పేర్కొన్నారు. దీంతోపాటు స్పానిష్ స్టార్టప్ తయారుచేసిన చిన్నపాటి ‘క్యాప్సుల్’ను, మరో 17 దేశవిదేశాలకు చెందిన శాటిలైట్స్‌ను ఇస్రో ఈ మిషన్ ద్వారా నింగిలోకి పంపింది. దేశరక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రయోగం విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.
Also Read..
ISRO | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ62
Service Charge | రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జిని విధించరాదు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
Masina Hospital | పైసలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం.. ముంబైలోని మసీనా దవాఖానలో దారుణం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

