Indian Embassy | పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే ఉన్నది.. న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత్ ఆగ్రహం
Indian Embassy | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో జరుగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ అమెరికా మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్ (Newyork Times)’ రాసిన కథనం వివాదానికి దారితీసింది. ‘స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్థాన్ కశ్మీర్లో ఘర్షణలు చెలరేగాయి’ అంటూ ఆ కథనానికి శీర్షిక పెట్టింది. దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తీవ్రంగా స్పందించింది
India Embassy : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో జరుగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ అమెరికా మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్ (Newyork Times)’ రాసిన కథనం వివాదానికి దారితీసింది. ‘స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్థాన్ కశ్మీర్లో ఘర్షణలు చెలరేగాయి’ అంటూ ఆ కథనానికి శీర్షిక పెట్టింది. దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తీవ్రంగా స్పందించింది. ఆ కథనంలో పాకిస్థాన్ కశ్మీర్ అనే ప్రస్తావనను తీవ్రంగా ఖండించింది.
‘అది తప్పుదోవ పట్టించే శీర్షిక. పాకిస్థాన్ కశ్మీర్ అంటూ ఏదీ లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే (POK). కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. వీటిలోని కొన్ని భాగాలను పాకిస్థాన్ (Pakistan) చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. ఇప్పుడు అక్కడి ప్రజలపై హింసకు పాల్పడుతోంది’ అని భారత ఎంబసీ మండిపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తోన్న ఎన్నికల సందర్భంగా నిరసనకారులు, భద్రతాదళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఆందోళనకారులపై పాకిస్థాన్ భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో.. ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడాన్ని నిషేధించారు. మరోవైపు ఆందోళనల్లో చనిపోయిన తమవారి మృతదేహాలను భద్రతాదళాలు ఇవ్వడంలేదని పలు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, పాలనాపరమైన సమస్యలు, రాజకీయ వివక్ష వంటి అంశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనలకు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తున్నది.
కాగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించడంపై భారత్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న కపట ప్రయత్నాల్లో అవి భాగమని దాయాదిని దుయ్యబట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

