ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ సీ-62 (PSLV C-62) రాకెట్‌ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా 14 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం బరువు 1,485 కేజీలు. దీనికి అన్వేష (Anvesha)గా నామకరణం చేశారు.
ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన శాటిలైట్‌లో అత్యంత అధునాతమైనది ‘ఈవోఎస్-ఎన్1’ (అన్వేష)ను రోదసిలోకి పంపుతున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకమని, ఇది 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఇప్పటికే తెలిపారు. రోదసి నుంచి భారత్ నిఘా సామర్థ్యాల్ని పెంచేదిగా, భూమిపై ఓ కన్నేసి ఉంచటంగా ‘అన్వేష’ను సైంటిస్టులు పేర్కొన్నారు. దీంతోపాటు స్పానిష్ స్టార్టప్ తయారుచేసిన చిన్నపాటి ‘క్యాప్సుల్’ను, మరో 17 దేశవిదేశాలకు చెందిన శాటిలైట్స్‌ను ఇస్రో ఈ మిషన్ ద్వారా నింగిలోకి పంపుతున్నది. దీంట్లో ‘క్యాప్సుల్’ ఒక్కటే దక్షిణ పసిఫిక్ సముద్రజలాల్లో ‘స్లాష్డౌన్’ అవుతుంది.
Also Read..
Service Charge | రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జిని విధించరాదు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
Masina Hospital | పైసలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం.. ముంబైలోని మసీనా దవాఖానలో దారుణం
నేను ఫోన్, ఇంటర్నెట్ వాడను : దోవల్