న్యూఢిల్లీ, జనవరి 11: భారత రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను వ్యక్తిగత అవసరాలు, రోజువారీ పనుల కోసం ఫోన్లు, ఇంటర్నెట్ను వాడనని, దాని కోసం ఇతర కమ్యూనికేషన్ మార్గాలను అనుసరిస్తానని, అవి సామాన్యులకు తెలియదని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3 వేల మందికి పైగా యువ ప్రతినిధులు హాజరైన ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో ఈ మొబైల్, ఇంటర్నెట్ యుగంలో అవి ఉపయోగించకుండా ఎలా సంభాషిస్తున్నారు?
అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘నేను ఫోన్లు వాడనన్న విషయం మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. వ్యక్తిగతంగా తప్ప నేను ఫోన్, ఇంటర్నెట్లు వాడనన్న విషయం నిజమే. అవి లేకుండానే నేను నా విధిని నిర్వహిస్తున్నా. అయితే అప్పుడప్పుడు విదేశాల్లోని వారితో నేను సంభాషించాల్సి ఉంటుంది. అప్పుడు వాటిని ఉపయోగిస్తాను. అయితే దానికి ఇతర కమ్యూనికేషన్ మార్గాలను అనుసరిస్తా. అవి సామాన్యులకు తెలియవు’ అని ఆయన అన్నారు.