Apples | కూరగాయలు, కోళ్లు, ఇతర సరుకులు తీసుకెళ్తున్న వాహనాలు రోడ్లపై బోల్తా పడుతుండటం చూస్తూనే ఉంటాం. సాధారణంగా వాహనాలు బోల్తా పడితే అందులో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఎలా ఉందని ఆరా తీయడం పక్కన పెట్టి.. ఆ వాహనంలో నుంచి బయట పడ్డ వాటిని ఎలా ఎత్తుకెళ్లాలని ఆలోచించేవాళ్లే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. జనాలు మిగితా విషయాలేమి పట్టించుకోకుండా ఎగబడి మరి వాటిని లూటీ చేస్తుంటారు.
వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అసలే నోరూరించే పండ్లు.. ఎవరు ఊరుకుంటారు చెప్పండి.. అటుగా వెళ్తున్న జనాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కింద పడ్డ ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. పోటీ పడి మరీ తమ దగ్గరున్న సంచులు, కవర్లు, బ్యాగుల్లో ఆపిల్పండ్లను నింపుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజ్ వద్ద ఈ ఘటన జరిగింది. క్షణాల్లోనే ఆపిల్ పండ్లను లూటీ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం
ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు.. నిమిషాల్లోనే డీసీఎం పండ్లు లూటీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజ్ వద్ద ఘటన pic.twitter.com/ZPA0SBCtNm
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
Municipal Commissioner | భద్రకాళి బండ్పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు