Pilot Dies | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express)కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు (Pilot Dies). విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ అర్మాన్ (29) బుధవారం శ్రీనగర్ (Srinagar) నుంచి ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అయితే, అతడికి ఇదే చివరి విమాన ప్రయాణం అవుతుందని ఊహించలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన కాసేపటికే అర్మాన్ అస్వస్థతకు గురయ్యా డు. దీంతో తోటి సిబ్బంది అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అర్మాన్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అంతకుముందు విమానంలో కూడా అతను వాంతులు చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.
Also Read..
Hot Air Balloon | హాట్ ఎయిర్ బెలూన్‌పై నుంచి పడి వ్యక్తి మృతి.. షాకింగ్ వీడియో
Lightning | బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
Tahawwur Rana | ఎవరీ తహవూర్ రాణా..? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి..?