Lightning | బీహార్ (Bihar) రాష్ట్రంలో వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, వడగళ్ల వానలు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. వర్షం కారణంగా అనేక చోట్ల పిడుగులు (Lightning) పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
బెగుసరాయ్, దర్భంగా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, మధుబనిలో నలుగురు, ఔరంగాబాద్, సమస్తిపూర్, సహర్సా నుంచి ఇద్దరు చొప్పున, ఔరియ్యలో ఒక్కరు.. మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు (ఒక్కో కుటుంబానికి) ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని సూచించారు.
Also Read..
Tahawwur Rana | ఎవరీ తహవూర్ రాణా..? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి..?
Dominican Republic | నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిన ఘటన.. 184కు చేరిన మృతుల సంఖ్య