Dominican Republic | కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic) రాజధాని శాంటో డొమింగోలోని ఒక నైట్ క్లబ్ పైకప్పు కూలిన (Nightclub Roof Collapse) ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 184కు చేరింది. దాదాపు 155 మంది వరకూ గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.
జెట్‌సెట్ క్లబ్లో మంగళవారం తెల్లవారుజామున 12:44 గంటల సమయంలో ప్రసిద్ధ మురాంగే గాయకుడు రూబీపెరెజ్ పదర్శన ఇస్తున్నారు. అంతా ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉన్నట్టుండి పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో క్లబ్లో 500 మంది నుంచి 1,000 మంది వరకూ ఉంటారని అంచనా. మృతి చెందిన వారిలో మురాంగే గాయకుడు రూబీపెరెజ్ కూడా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని బుధవారం కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా నివేదించింది.
Also Read..
Renu Desai | నేను వేరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
NREGA | పనులు కల్పించండి.. ఉపాధి హామీ కార్మికుల ధర్నా
D56 | పాపులర్ డైరెక్టర్‌తో వన్స్‌మోర్.. ధనుష్ D56 థీమ్ పోస్టర్ వైరల్