D56 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. శేఖర్‌కమ్ముల డైరెక్షన్లో నటిస్తోన్న కుబేర జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ ఏడాది కుబేరతోపాటు ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ తాజాగా మరో సినిమా ప్రకటించేసి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు.
ధనుష్ పాపులర్ ఫిల్మ్ మేకర్ మారి సెల్వరాజ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. థనుష్ తన కొత్త ప్రాజెక్ట్ డీ 56 (వర్కింగ్ టైటిల్)ను ప్రకటించేశాడు. మూలాలు ఒక గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి.. అంటూ క్యాప్షన్ ఇచ్చి హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండబోతున్నట్టు థీమ్ పోస్టర్ ద్వారా చెప్పాడు ధనుష్. థీమ్ పోస్టర్లో ఖడ్గం, పుర్రెను చూడొచ్చు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నాడు ధనుష్.
ధనుష్-మారి సెల్వరాజ్ కాంబోలో వచ్చిన రూరల్ యాక్షన్ డ్రామా కర్ణన్ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మరి ధనుష్-మారి సెల్వరాజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
#D56 Roots begin a Great War
A @mari_selvaraj film pic.twitter.com/3yfhd6B2pZ— Dhanush (@dhanushkraja) April 9, 2025