Samantha | అగ్ర కథానాయిక సమంత నటనతో పాటు సినీనిర్మాణంపై దృష్టి పెడుతూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్‌మీడియాలో కూడా యాక్టివ్‌గా మారింది. ఇటీవలే ఈ అమ్మడు ‘ఎక్స్’లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నది. రెండేళ్లక్రితం వచ్చిన ‘ఖుషీ’ తర్వాత పెద్ద చిత్రాలు చేయలేదు సమంత. ఈ ఏడాది మాత్రం భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యేందుకు సిద్ధమవుతున్నదని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం ఇటీవల ప్రకటించిన అల్లు అర్జున్-అట్లీ పాన్ ఇండియా చిత్రంలో సమంత కథానాయికగా నటించే అవకాశముందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంటుందట. మరో నాయికను బాలీవుడ్ నుంచి తీసుకుంటారని తెలుస్తున్నది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో బన్నీతో జోడీగా నటించింది సమంత. ఆ తర్వాత ‘పుష్ప’లో ప్రత్యేకగీతంలో ఆయనతో నర్తించింది. ఒకవేళ అట్లీ-బన్నీ ప్రాజెక్ట్‌లో సమంత నాయికగా ఖరారైతే ఇది వాళ్లిద్దరికి హ్యాట్రిక్ కాంబినేషన్ కానుంది. అయితే ఈ వార్తల్లో వాస్తవమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.