Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందిపుచ్చుకున్నారు. ఆయన ఎంత ఎదిగిన ఒదిగే ఉంటారనే విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్.. యాంకర్ ప్రదీప్‌కి తన వంతు సాయం చేశారు. ప్రదీప్ – దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11 న రిలీజ్ కాబోతుంది. గత కొద్ది రోజులుగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్రదీప్ ఇప్పుడు రెండో సినిమాతో కూడా అలరించేందుకు సిద్ధమయ్యాడు.
మూవీ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొన్నారు. అయితే రామ్ చరణ్‌ని కలిసేందుకు ప్రదీప్ తో పాటు కమెడియన్ సత్య ఇద్దరూ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ సత్య .. చరణ్ నాకు బాగా క్లోజ్ అని, నేను ఎంత చెప్తే అంత అని కాసేపు కామెడీ చేసారు. చరణ్ కూడా సత్య అసలు ఎవరో తెలియనట్టు ఆటపట్టించారు.ఇక సినిమా టిక్కెట్ కొన్న తర్వాత సత్య.. రామ్ చరణ్ కాళ్లు మొక్కడంతో చరణ్ కూడా సరదాగా సత్య కాళ్లు మొక్కబోయాడు. ఇది చూసిన చాలా మంది రామ్ చరణ్ కూడా భలే సరదా మనిషిగా అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న గ్లోబల్ రిలీజ్ అంటూ పెద్ది రిలీజ్ డేట్‌ని అఫిషియల్‌గా అనౌన్స్ చేసేసింది టీమ్. ఈ ఏడాది ఉంటుందా? లేదా? అనే మాటలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులకి పిచ్చిగా నచ్చేసింది. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ పక్కాగా మాట్లాడుతున్నారని సంబరపడుతున్నారు అభిమానులు. రామ్‌చరణ్‌తో జాన్వీ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. సినిమా గ్లోబల్ రేంజ్లో ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఒక్క గ్లింప్స్‌తోనే వచ్చేసింది.