Jack Twitter Review | డీజే టిల్లుతో యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఆ తర్వాత టిల్లు స్క్వేర్ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సిద్దు జొన్నలగడ్డ కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం జాక్(Jack).. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. బేబి సినిమాతో అదిరిపోయే క్రేజ్ సంపాదించిన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది.
చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన జాక్‌పై నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేస్తే..
ఎక్స్‌లో నెటిజన్ల టాక్ ఇలా..
Bhaskar’s last 3 films have failed at the box office, but they were feel-good movies.
Orange is still performing well in its re-release. Can we expect a film like Orange from Bhaskar again? Will #Jack be similar to Orange or different
Sidhu will suit for RAM character— Anjineyulu Reddy Rodda (@nani19030063) April 10, 2025
బొమ్మరిల్లు భాస్కర్ గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. కానీ అవి ఫీల్ గుడ్ సినిమాలు. ఆరెంజ్ ఇప్పటికీ రీరిలీజ్ అయిన తర్వాత బాగా ఆడింది. భాస్కర్ నుంచి మనం మళ్లీ ఆరెంజ్ లాంటి సినిమాను ఆశించవచ్చా..? జాక్ మూవీ ఆరెంజ్ సినిమా లైన్లో ఉంటుందా..? సిద్ధూ రామ్ (ఆరెంజ్‌లో రాంచరణ్ పాత్ర)క్యారెక్టర్‌కు సరిపోతాడా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
#Jack unexpected review 😶
Traiker చూసి బాగుంటుంది అనుకున్నా ! https://t.co/1Gdu6jpOTU
— కథనంతో కట్టిపడేసే సినిమాల అభిమాని (@oke_Okka_Chance) April 10, 2025
స్పై యాక్షన్ కామెడీ జోనర్లో వచ్చి నిరాశనే మిగిల్చింది. స్పై పోర్షన్లతోపాటు చాలా సీన్లలో కామెడీ పండించడంలో కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ అన్ని కమర్షియల్ హంగులతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. పేలవమైన స్క్రీన్ ప్లే, బలహీనమైన రైటింగ్ వెరసి.. ఏ అంశాలు అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయాయి.
Career set avuthunna time lo, ilanti cinema ki okay chesi, baaga #Jack ayyadu. 🤷🏻♂️
Spy action comedy ani cheppi, highly disappointing ga theesaru cinema. #Bhaskar made a comeback with #MEB, but with this he went back to the past 🤷🏻♂️
Apart from #Siddhu’s timing, nothing worked out!— Chiranjiv Santhosh Malla (@kingchiru15) April 10, 2025
కెరీర్ సెట్ అవుతున్న టైంలో ఇలాంటి సినిమా చేశాడు. స్పై యాక్షన్ కామెడీ అని చెప్పి చాలా నిరాశకు లోనుచేసేలా సినిమా తీశారు. బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చాడు.. కానీ జాక్‌తో మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు.
#Jack: StarBoy for a Reason? Not Quite!
Rating: ⭐️⭐️Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring and…
— Chay Reviews (@chay_reviews) April 10, 2025
స్పై జోనర్లో వచ్చిన జాక్ భారీ నిరాశనే మిగిల్చింది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తాను రాసుకున్న దానికి, డైరెక్ట్ చేసిన దానికి మధ్య గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. స్పై థ్రిల్లర్ జోనర్లో వచ్చిన స్పూఫ్ కామెడీలా.. బోరింగ్ కథనంతో సాగిపోతుంది. ఇలాంటి కామెడీ కథనంలో RAW ను చేర్చడం పెద్ద బ్యాక్ డ్రాప్. డల్‌గా ఉన్న స్క్రిప్ట్‌కు సిద్దు జొన్నలగడ్డ మ్యానరిజం ప్లస్ అయిందని చెప్పాలి.
#Jack Only for Siddu!!
Just some comedy scenes and Siddu role, Nothing worked in film.
Siddu dialogues, Comedy timing, Action helped film atleast for a One time watch.
Stroy, Screenplay, Music, Songs, BGM, cinematography Everything 👎
Only for Siddu Character and Some One…
— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) April 10, 2025
కొన్ని కామెడీ సన్నివేశాలు, సిద్దు పాత్ర మినహా సినిమాలో ఏది పెద్దగా వర్కవుట్ అవలేదు. సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సినిమాకు కొంత ప్లస్ పాయింట్. సిద్ధు కోసం ఒక్కసారి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చు. కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సాంగ్స్, బీజీఎం, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్ని ఎలిమెంట్స్ నిరాశనే మిగిల్చాయి.