Renu Desai | నేను వేరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
Renu Desai | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సత్తా చాటింది.
Renu Desai | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సత్తా చాటింది. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణూ తన పిల్లలని చూసుకుంటూ కాలంగ గడుపుతుంది. ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో సైలెంట్ అయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ అప్పుడప్పుడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది. పవన్ నుండి విడిపోయాక రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
అప్పట్లో తాను ఎవరినో పెళ్లి చేసుకుంటుందని, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని వార్తలు వచ్చాయి. కాని రేణూ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. తాజాగా తన రిలేషన్ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో నేను అరేంజ్డ్ నిశ్చితార్థం చేసుకోవాలి, వేరే రిలేషన్ షిప్‌లోకి వెళ్లాలి అని అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుంటే పిల్లలకి సరైన న్యాయం చేయలేనేమో అని ఆగాను. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. నేను వేరే జీవితం మొదలు పెడితే వారికి పూర్తి సమయం కేటాయించలేను. అందుకే వేరే రిలేషన్లోకి వెళ్లలేదు.ఆద్యకి 18 ఏళ్ళు దాటాక తనంతట తాను అన్ని పనులు చేసుకునే స్థాయికి వచ్చాక, తాను బిజీ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ రేణూ కామెంట్ చేసింది.
అంటే భవిష్యత్తులో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకొనే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇక అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కూడా రేణూ దేశాయ్ మాట్లాడింది. అకిరాని రామ్ చరణ్ లాంచ్ చేస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తవం. నాకు కూడా అలాంటి చాలా ఆర్టికల్స్ వస్తాయి. అవి అకిరాకి పంపుతాను. నాకెందుకు పంపుతావు ఇలాంటివి అని ఇద్దరం నవ్వుకుంటాం. ఓజీ సినిమాలో అకిరా నటించట్లేదు. అకిరా యాక్టింగ్ చేస్తే నేనే అధికారికంగా చెప్తాను. అతనికి యాక్టింగ్ ఆలోచన వచ్చినా నేనే చెప్తాను. అప్పటిదాకా మీ వ్యూస్ కోసం అకిరా గురించి అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.కొంతమంది అకీరాని తిడుతున్నారు. అకిరా వస్తే హీరో కొడుకు, నెపోటిజం అని అంటున్నారు. నేను అయితే ఇదే చేయాలని ఏమి చెప్పలేదు. తనకి ఏం నచ్చితే అదే చేయమని చెప్పాను అని రేణూ స్పష్టం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

